Many of us does not know
that Actor Ranganath is a good poet . I watched one of his interviews in
youtube and really impressed with his work…He mentioned one of his poems in it.
I am bringing it to you….Hope
all of you like it.
ఏది దేవుడు...? ఏది బండ?
అదేదో ఊరి నుంచి మహా శిల్పి
వచ్చాడు.
మరేదో ఊరి నుంచి పెద్ద బండ
తెచ్చాడు.
ఆరడుగులు కొలత పెట్టి బండను
ఖండించాడు
మిగిలిన మూడడుగుల ముక్కను
పక్కకు తోసేశాడు.
ఆరడుగుల బండేమో విగ్రహమై
వెలసింది.
మూడడుగుల ముక్క బండ చాకి
రేవు చేరింది.
కంపు కంపు మనసులన్నీ దేవుని
ఎదుట నిలిచాయి
కంపు గొట్టే బట్టలన్నీ
బండచుట్టూ చేరాయి.
గొంతెమ్మ కోర్కెల
గొంతులన్నీ తీర్ధంతో తడిశాయి.
మురికి మరకల బట్టలన్నీ
నీటిలోన మునిగాయి.
అర్ధంకాని స్తోత్రాలతో
పూజారి భక్తి శ్రద్ధలు....
చాకలి నోటి వెంట ఇస్సు
ఇస్సు శబ్దాలు...
షటగోపం పవిత్రంగా ప్రతి
తలనూ తాకుతోంది..
పవిత్రతకై ప్రతి బట్టా
బండను తాకుతోంది.
కడగు గుడినుండి మనసులన్నీ
కంపుతోనే వెళ్ళాయి..
రేవునుండి బట్టలన్నీ ఇంపుగా
వెళ్ళాయి.....
ఏది దేవుడు..? ఏది బండ..?
No comments:
Post a Comment