Monday, August 26, 2013

కాశీకి వెళ్ళిన కధ

Hi all,

       Few stories will haunt you even after reading it. I read such story recently which i wanted to share with u all.

this  story is named as"Kaasi ki vellina kadha " Which was written by JSV prasad. and it is published in Swathi magazine last week.

Initially i did not like the narration of the story as i felt it may be like regular saga of an old couple, But at the end of the story, he captured the sense of humanity and compassion.

i will tell you the story in a brief now. I cant write in such a way he wrote it, but its gist of it.



ఒక వూర్లో ఒక వృద్ధ జంట వుంటారు. అందులో ఆ ముసలాయనకి ఎప్పుడూ దగ్గు వస్తూ వుంటుంది. అది చూసిన వాళ్ళావిడ “ అబ్బాయికి చెప్పి ఏదైనా మంచి హాస్పిటల్ కి తీసుకెళ్ళమని చెబుతాను..” అంటుంది.
దానికి ఆయన “వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం ...ఏదో చిన్న సిరప్ తాగితే పోతుంది “ అంటాడు.
మొత్తం ఆస్తి అంతా కొడుకు పేరన రాసేయ్యడం వలన కొడుకు వీళ్ళని సరిగ్గా పట్టించుకోడు. కొడుకు పేరు శ్రవణ్. పైగా పెన్షన్ వచ్చే టైం కి కోడలు, మనవలని అందరినీ తాత,మామ్మ దగ్గరికి పంపేస్తుంది. వాళ్లకి చాక్లెట్లు,ఐస్ క్రీం లు కొని ఇచ్చి వీళ్ళ డబ్బులు ఖర్చు చేసుకుంటూ వుంటారు. అది వీళ్ళ పరిస్థితి.
ఇక ఎంతో కాలం బతకం అని తెలిసిన ఈ ముసలాయనకి ఒక ఆఖరి కోరిక వుంటుంది . అది కాశీకి వెళ్లడం. కొడుకుని ఎన్నిసార్లు అడిగినా డబ్బు ఖర్చు అని చెప్పి తీసుకెళ్లడం మానేస్తాడు. చివరికి ఒకరోజు అప్పులవాడు శ్రవణ్ ఆఫీస్ దగ్గరికి వచ్చేటప్పటికి ,వాడినుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న ఇతనిని చూసి ఒక తలకుమాసిన స్నేహితుడు ఒక సలహా ఇస్తాడు.
ఇప్పుడు ఇతని తల్లి ,తండ్రి వుంటున్న ఇతని ఇల్లు రెండు లక్షలు చేస్తుంది. అందులో కొంత అప్పు తీర్చి,  వీళ్ళని ఎక్కడైనా అనాధ ఆశ్రమంలో వదిలేస్తే,   లక్ష రూపాయలు మిగులుతుందని సలహా ఒకటి పారేస్తాడు. సరిగ్గా అది విని ఐడియా వచ్చి శ్రవణ్, ఇంటికొచ్చి అమ్మా నాన్నలని కాశీకి తీసుకెళ్తానని చెప్పి ,భార్య కి చెప్పి కాశీ బయలు దేరతాడు.
తమ జీవితంలో వున్న ఏకైక కోరిక తనయుడు తీరుస్తున్నందుకు ఆ వృద్ద జంట లోలోపలే మురిసిపోతారు.
కాశీకి తీసుకెళ్ళిన శ్రవణ్, వీళ్ళని అన్నీ ఘాట్ లకి తిప్పి, చివరికి ఒక ఘాట్ లో చెట్టు కింద కూర్చో బెట్టి, టిఫిన్స్ తీసుకొస్తానని, తండ్రి చేతిలో వున్న బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాడు. అందులో ఫోన్ నంబర్ల బుక్ కూడా వుంటుంది.
ఆ ఘాట్ దగ్గర ప్రశాంతం గా కూర్చున్న జంట , అలాగే చాలాసేపు వుండిపోతారు. ఎంతసేపటికీ కొడుకు రాడు. ఎక్కడైనా తప్పిపోయాడో, లేదా ఏదైనా ఇబ్బంది పడుతున్నాడో అని ఆలోచిస్తూ, తండ్రి ఫోన్ నంబర్ల పుస్తకం గురించి చూస్తాడు. అది కూడా బ్యాగ్ లోనే వుండిపోయింది. ఏదో కొంత డబ్బు మాత్రం మిగిలి వుంటుంది.
అంతమంది జనాల మధ్యలో కాశీలో తల్లిని తండ్రిని వదిలేసి శ్రవణ్ ఇంటికొచ్చేస్తాడు. ఇంటికొచ్చాక జరిగింది భార్యతో చెప్పి , వాళ్ళు ఎక్కడో తప్పిపోయారని నాటకం ఆడమంటాడు. జనాలందరి దృష్టిలో వీళ్ళ అమ్మా,నాన్న కాశీలో తప్పిపోయారు. కొన్ని రోజుల తరవాత, వాళ్ళిద్దరూ అక్కడే చనిపోయారని చెప్పి ఏడుస్తాడు. ఇది చుట్టుపక్కల వున్నవాళ్ళు కూడా నమ్మేస్తారు. అతను అనుకున్నట్టుగానే ప్లాన్ నడిచింది.
సాధారణంగా కాశీలో ఎవరైనా తమకి నచ్చినవి వదిలెయ్యాలి అంట, అలా ఈ శ్రవణ్ అమ్మా,నాన్నలని వదిలేశాడు. ఇది జరిగిన కొద్దిరోజులకి తల్లికి,తండ్రికి పెద్ద కర్మ కూడా చేసేస్తాడు. చివరి వయస్సులో తల్లితండ్రులకి సహాయంగా వుంటాడని ఇతనికి శ్రవణ్ అని వీళ్ళు పేరు పెట్టుకున్నారు. ఆ శ్రవణ కుమారుడు గుడ్డి వాళ్లైన తల్లిని,తండ్రిని కావిడి లో మోస్తే , ఈ శ్రవణ్ వీళ్ళని ఇలా అర్ధాంతరం గా వదిలేశాడు.
పెద్ద కర్మ అయిన కొద్దిరోజులకి ఇతనికి ఒక ఉత్తరం వస్తుంది. అది ఎవరో తెలిసిన వాళ్ళు రాసినది కాదు. అందులో ఇలా వుంటుంది. “ బాబు, కొద్దిరోజుల క్రితం కాశీలో ఒక ఘాట్ పక్కనే కూర్చుని తమ బిడ్డకోసం ఎదురుచూస్తున్న ఒక ముసలి జంటని చూశాను. వాళ్ళెవరో చూసినట్టుందే , అని వెళ్లి అడిగితే, మా వూరికి దగ్గర్లోనే వున్న ఒక ఊరినుంచి వచ్చారని తెలిసింది. టిఫిన్స్ తెస్తానని వెళ్ళిన కొడుకు రాకుండా పోయేసరికి, అతని నంబర్ ఏదైనా వుంటుందేమో అని చూస్తే, ఫోన్ బుక్ అతను తీసుకేల్లిపోయినట్టు తెలిసింది. అలాగె ఎదురు చూసిన జంటకి కొంత సహాయం చేసి వచ్చేసాను. కొద్ది రోజులకి, ఆ ముసలావిడ కొడుకు చేసిన మోసం భరించలేక గంగ నదీ ప్రవాహం లో పడి కొట్టుకుపోయింది. కానీ ఆ ముసలాయన అలాగే వున్నాడు. చివరికి అతనిని ఆదరించి అక్కడి నుంచి వాళ్ళ ఊరికి తీసుకొచ్చాను. వచ్చేటప్పటికి జరిగే తంతు చూసి అతనికి గుండె ఆగినంత పనయ్యింది. ఆరోజు అతని పెద్ద కర్మ.
జుట్టు మాసిపోయి, బాగా వడిలిపోయిన అతనిని, నన్ను ఎవరూ గుర్తు పట్ట లేదు. ఆ పంక్తి లో కూర్చుని అతను భోజనం చేస్తా అన్నాడు.  తన పిండాకూడు తనే , తినగలిగే అవకాశం దొరికినందుకు ఎంతో సంతోషించాడు. చాలా రోజులయ్యిందేమో తిని, తృప్తిగా తిన్నాడు. చివర్లో కొడుకుని ఆశీర్వదించి వచ్చి కాశీలో గుండె ఆగి చనిపోయాడు.
ఇంతకీ ఆ వచ్చిన వ్యక్తి నీ తండ్రి. ఇదంతా నీకు చెప్పొద్దు అన్నాడు. కానీ, ఇలాంటి కొడుకు కధ పది మందికీ తెలిస్తే మంచిది అని నేను నీకు చెబుతున్నా...ఇందులో పాత్రల పేర్లు మార్చి ఒక వందమందికి ఈ కధ రాసి పంపించు. కనీసం అది చదివిన వాళ్ళైనా నీలాగా ఆలోచించకుండా వుంటారు.” ...అదీ సారాంశం.
ఇది చదవి కొడుక్కి కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి. వెక్కి వెక్కి ఏడుస్తూ వుంటాడు.

పక్కనే ఇంట్లో ఒక పిల్లాడు వేమన శతకం చదువుతూ వుంటాడు. “ తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్ట నేమి, పుట్టలోని చెదలు పుట్టవా,గిట్టవా” అని వేమన పద్యం చదువుతాడు.

కధ చివరికి ఆ ఉత్తరం చదువుతున్నప్పుడు నిజంగా మనకి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. రెండువారాల క్రితం స్వాతి సంచిక అందుబాటులో వున్న వారు ఈ కధ తప్పక చదవండి. లేదా ఒక వారం లో నేను ఈ కధని స్కాన్ చేసి ఈ బ్లాగ్ లో మీ అందరికోసం ఇక్కడ వుంచుతాను..

అన్ని కధలు సాధారణంగా కంచి కి వెళ్తాయి అంటారు, కానీ వీళ్ళ కధ మాత్రం కాశీకి వెళ్ళింది అంటాడు రచయిత.

ఇలాంటి కధ రాసిన రచయిత జె.ఎస్.వి. ప్రసాద్ కు మాత్రం ప్రత్యేకంగా అభినందనలు తెలపాలి.    

Saturday, August 24, 2013

3 roses novel to be published in Swathi soon

Hi all,

      My first novel is getting published in Swathi soon.Please read it and let me know your 

      views on it.

      Below i am showing the first add that published in Swathi magazine this week.

     



Monday, August 19, 2013

Seethamma vaakitlo Sirimalle chettu



సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు:

ఈ దశాబ్దం లో వచ్చిన అతి పెద్ద మల్టీ స్టారర్ మూవీ. బాలీవుడ్ లో మాత్రమె మనం చూడగలుగుతున్న ఇటువంటి చిత్రాలు, తెలుగులో రావడం బాగా అరుదు. అలాంటి ప్రయత్నాన్ని చేసిన నటీనటులను, దర్శకుడిని, నిర్మాతను అభినందించి తీరాలి. ఇంటిల్లపాదీ కూర్చుని చూడదగిన చక్కని ఫ్యామిలీ పిక్చర్ ఇది.
అయితే ఇది విడుదలైన చాలా రోజుల తరువాత ఈ ఉపోద్గాతం ఎందుకు అని మీకు అనుమానం రావచ్చు. దానిని నివృత్తి చెయ్యాల్సిన బాధ్యత నా మీద వుంది. మనం చాలా సినిమాలు చూస్తాం, చూసి ఆనందిస్తాం. మళ్ళీ అదే ఆనందం కోసం అదే సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తాం. అంటే లడ్డూ తిన్న పిల్లాడు , లడ్డూ తినడానికే అలవాటు పడినట్టన్నమాట. అందులో ఆనందమూ మారదు,మనమూ మారము.

కానీ కొన్ని సినిమాలు మాత్రం, మనం ఒకసారి చూసినప్పుడు ఒకలాగా అర్ధమవుతాయి. దానిని మళ్ళీ చూసినప్పుడు ఇంకోలా అర్ధమవుతాయి. అవి మాత్రమే చరిత్ర లో క్లాసిక్స్ గా నిలిచిపోతాయి. వాటిని రాయగల్గిన రచయితలు, తీసిన దర్శకులు మహానుభావులు అనిపిస్తారు మనకి. అలాంటి చిత్రాలు రావడం ఇప్పుడు అరుదైపోయింది అనుకోండి...!

ఈ మధ్య కాలం లో కొన్ని సినిమాలు చూసినప్పుడు అక్కడతోనే అవి మర్చిపోయేలా వున్నాయి. వాటి గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అన్నట్టు. అవి హిట్ అయినా కూడా ఆ సినిమాలో మనం గ్రహించవలసినది ఏమీ వుండదు.

నిజానికి సినిమా మాధ్యమం అంటే కేవలం జన రంజకం మాత్రమే..కానీ అందులో కొన్ని మంచి విషయాలు నేర్పగలిగితే, కొంత జనాలకి చెప్పగలిగితే అని ఆలోచించగలిగే దర్శకులు వుంటే ఆ సినిమా మాధ్యమం యొక్క అవసరం, పరమార్ధం నెరవేరినట్టే. అలా చెప్పిన సినిమాలలో నాకు ఈ మధ్య కాలం లో నచ్చిన సినిమా “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”. అయితే అందరిలాగే మొదటిసారి చూసినప్పుడు పెద్ద మల్టీ స్టారర్ చిత్రం కాబట్టి ఎక్కువ అంచనాలతో వెళ్లాను. వాటికి సరితూగకపోయినా, కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం అందులో వున్న పాత్రలు, సన్నివేశాలు. ఏవీ కూడా కమర్షియల్ పంధా లో లేకుండా సాదాసీదాగా , నిజజీవితానికి దగ్గరగా నడిపించడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అదే సినిమాని రెండో సారి లాప్ టాప్ లో చూస్తున్నప్పుడు , ఎటువంటి అంచనాలూ లేవు కాబట్టి, అదే సినిమా నాకు ఇంకోలా అర్ధమైంది. “అదేంటి ఇంతకు ముందు ఇలా చూడలేదే నేను..” అనుకున్నాను. అయితే అందరూ నాలాగా చూసీ వుండరు, లేదా మొదటిసారి నాలాగే చూడకుండాను వుండరు. కానీ నేను చూసి, అర్ధం చేసుకున్నదానిని మీతో పంచుకోవాలి అనుకుంటున్నా...అంతే..!

కధ విషయానికి వస్తే , ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ, వాళ్ళని రేలంగోల్లు అంటారు. ఆ ఇంటికి పెద్ద ప్రకాష్ రాజ్. అతని భార్య జయసుధ, తల్లి రోహిణీ హట్టంగడి వుంటారు. వీళ్ళతో పాటు సీత కూడా వుంటుంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ అందరినీ పలకరిస్తూ వుండే ప్రకాష్ రాజ్ గారికి ఇంట్లో ఒక సమస్య వుంది. అది అతని ఇద్దరు కొడుకులూ సమయానికి అందిరాక, సరైన ఉద్యోగాలు దొరక్క నిరుద్యోగులుగా వుండటం.
అందులో పెద్దోడు , వెంకటేష్. బొత్తిగా లౌక్యం తెలియని మనిషి. కోపాన్ని అయినా, ఆనందాన్ని అయిన వెంటనే పైకి ప్రదర్శిస్తాడు. అలాగే వున్న ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. ఇక చిన్నోడు మహేష్ బాబు. ఎలాంటి సమస్యకైనా లౌక్యంతో , కొంత వెటకారంతో, సమాధానం చెప్పగలడు. ఎదురుపడి “లవ్ చేస్తున్నా” అన్న అమ్మాయిని కూడా వెటకారంగా ఒక మాట అని తప్పించుకోగలడు.ఇలాంటి వీళ్ళ ఇంట్లో వీళ్ళకి ఒక చెల్లి కూడా వుంది.
అందరిలాగే వీళ్ళని ద్వేషించే విజయవాడ వాళ్ళు. రావు రమేష్ వాళ్ళ ఇంటికి పెద్ద. రేలంగి వాళ్ళంటే ఇతనికి కోపం. జెలసీ. ఎందుకంటే తమ్ముడిని ఎంత వద్దన్నా ,వాళ్ళింటి అమ్మాయిని చేసుకున్నాడు. చివరికి చిన్న యాక్సిడెంట్ లో అతను అతని భార్య  చనిపోయి, వాళ్ళ కూతురు సీతని వదిలేశారు. కానీ సీత చిన్నప్పటి నుంచి రేలంగి మావయ్య దగ్గర పెరిగింది. పైగా ఆమెని పెద్దోడికి ఇచ్చి పెళ్ళి చేద్దాం అనుకోవడం కూడా. అదీ రావు రమేష్ కి నచ్చనిది..
విజయవాడ వాళ్ళ ఇంట్లో ఒక పెళ్ళికి రేలంగి వాళ్ళ ఇంట్లోంచి పెద్దోడు వెల్లనంటే, చిన్నోడిని పంపిస్తారు. అక్కడ   వాళ్ళ అమ్మాయి(సమంత) ఇతన్ని ఇష్టపడుతుంది. ఆమె పెళ్ళి కూతురికి చెల్లి. పెళ్ళి కూతురు , అత్తగారితో కలిసి అన్నవరం వెళ్లి వస్తుంటే ట్రైన్ లో ,రేలంగి మావయ్య ఎదురుపడి వాళ్ళతో సరదాగా మాట్లాడుతాడు. అది చూసి పెళ్ళి కూతురి అత్తగారు, రేలంగి వారి అమ్మాయికి ఒక మంచి సంభందం చూస్తారు.ఆ సంభందం కుదుర్చుకుని పెళ్ళి చేస్తారు రేలంగి వాళ్ళు .పెళ్ళికి విజయవాడోళ్ళు కూడా వస్తారు.
వాళ్ళంటే పడని పెద్దోడు సరిగ్గా రావు రమేష్  దగ్గర మాట కాస్తాడు. దానితో అతనికి కోపం వచ్చి ఒక మాట అంటాడు.గొడవ జరుగుతుంది. చుట్టూ వున్న పెద్దలు ఏదో సర్ది చెబుతారు. ఇంతలో పెళ్ళి హడావుడిలో పెద్దోడి ని పిలవడానికి వచ్చిన చిన్నోడు అతన్ని చూసి పెళ్ళి చూడటానికి లోపలికి రమ్మని అడుగుతాడు. “అందరూ వెళ్లి కుదుర్చుకుని వచ్చారుగా సంభందం “ అంటాడు కోపంగా..దానికి చిర్రెత్తుకొచ్చిన చిన్నోడు  మొక్కని తన్నేసి కోపంగా వెళ్ళిపోతాడు.
ఇక అక్కడినుంచి అన్నదమ్ములిద్దరి మధ్య చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వుంటుంది. దానిని సవరించుకోడానికి మహేష్ , వెంకటేష్ ని హైదరాబాద్ తీసుకెళ్తాడు. కానీ అక్కడ అనుకోని పరిస్థితులలో తిరిగి మహేష్ ని సమంత తో చూసిన వెంకటేష్ అలిగి ఇంటికొచ్చేస్తాడు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది.
ఈలోగా ఒక వ్యక్తిని కాపాడబోయి ప్రకాష్ రాజ్ యాక్సిడెంట్ కి గురవుతాడు. అతని మంచితనం అందరికీ తెలుస్తుంది.అదే సమయంలో అందరూ భద్రాచలం వెళ్లడం, అక్కడ ఒక ప్రమాదం లో వీళ్ళందరూ సాటి మనుషులకి సాయ పడటం జరుగుతుంది. దానిలో వీళ్ళ పాత్ర చూసి పక్కనే వున్న రావు రమేష్ వీళ్ళ మంచితనం అర్ధం చేసుకుంటాడు. అన్నదమ్ముల మధ్య వున్న పొరపొచ్చాలు అన్నీ తండ్రి చెప్పిన మంచి మాటల వలన తీరిపోతాయి.
చివరికి పెద్దోడు సీతని పెళ్ళి చేసుకోవడంతో కధ సుఖాంతం అవుతుంది.

అనాలిసిస్:  
1.ఈ కధ కొన్ని ఫ్యామిలీస్ మధ్య నున్న సున్నితమైన భావోద్వేగాలుగా కనిపిస్తుంది. అందులో ముఖ్య పాత్రలు చిన్నోడు,పెద్దోడు, తండ్రి ప్రకాష్ రాజ్. అంతర్లీనంగా వుండే పాత్ర సీతది.
2.నాకు అర్ధమైనంత వరకు, ఒకరితో ఒకరు సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోలేక ఇబ్బంది పడి సమస్యని పెంచుకున్న ఇద్దరు అన్నదమ్ముల కధ ఇది. ఒకరి మీద కోపాన్నైనా, ఇష్టాన్నైనా డైరెక్ట్ గా చెప్పలేం మనం. అందుకే దానికి వేరే దారి వెతుక్కుంటాం. సాధారణంగా అందరి ఇళ్లలోనూ కనిపించే వాతావరణమే ఇది.
3.మొదటి సీన్ లోనే కోట శ్రీనివాసరావు తో గొడవ పడేటప్పుడే పెద్దోడు లౌక్యం లేని, ముక్కు సూటి మనిషి అని అర్ధమవుతుంది. రెండో సీన్ లో చిన్నోడు బాగా లౌక్యం నేర్చుకున్నవాడు అని తెలుస్తుంది.వాళ్ళిద్దరి మధ్యా సంభాషణ కూడా అలాగే వుంటుంది పూర్తిగా ఒకరి అభిప్రాయలు ఒకరు వ్యక్తపరుచుకోలేకుండా.
4.విజయవాడోల్ల ఇంటి పెళ్ళికి పెద్దోడు వెళ్ళడు. చిన్నోడు వెళ్ళడం అతనికి నచ్చదు కానీ ఏమనడు. తీరా చెల్లికి పెళ్ళి సంభందం విజయవాడోల్ల నుంచి వచ్చిందని తెలిసి పెద్దోడు కోప్పడతాడు. ఆ విషయంలో చిన్నోడికి కోపం వస్తుంది. ఇంట్లో అమ్మకి చెప్పేసి హైదరాబాద్ తిరిగి బయలుదేరతాడు. కానీ అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర పెద్దోడి కోసం చూస్తూ వుంటాడు. కోపం వచ్చిందని పైకి చెప్పడు, అలాగని ఎదురు చూడకుండా వుండడు. చివరికి పెద్దోడు అక్కడికి వస్తాడు. ఆ క్షణంలో వాళ్ళ మధ్య ఈగో తొలగిపోతుంది.
5. తరువాత విజయవాడోల్ల సంభందమే ఫిక్స్ అయ్యి చెల్లి కి పెళ్ళి జరుగుతూ వుంటుంది. కొబ్బరితోటలో పెళ్ళి ఎరేంజ్ మెంట్స్ చూసి రావు రమేష్ జెలసీ ఫీలవుతాడు. అక్కడ పెద్దోడికి సీతనిచ్చి పెళ్ళి చేస్తారా అని అతనిని  అడుగుతారు మిగతావారు. అనుకోని విధంగా, పెద్దోడికి ,రావు రమేష్ కి గొడవ జరుగుతుంది. “నా కూతురు చేసి వుండక పోతే ఈ సంభందం మీకు దొరికేది కాదు అని దెప్పుతాడు” రావు రమేష్. దానితో పెద్దోడికి కోపం వస్తుంది. నిజానికి రావు రమేష్ తో జరిగిన గొడవ చిన్నోడికి తెలీదు. పెళ్ళి ఇంట్లోకి రమ్మని పెద్దోడిని పిలవడానికి వస్తే , అది కాస్తా అతను మాట పట్టింపుగా తీసుకుని, చిన్నోడు విజయవాడొల్ల ఇంట్లో పెళ్ళికి వెళ్లడం వల్లే ఇదంతా జరిగింది అని మాట విసుర్తాడు. ఆ మాటకి హార్ట్ అయిన చిన్నోడు ఎలాగోలా కన్విన్స్ చెయ్యాలనుకుంటాడు.కుదరదు. మళ్ళీ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఇదంతా అప్పుడే వచ్చిన సీత చూస్తుంది. వీళ్ళ మధ్య జరిగింది ఆమెకి ఒక్కదానికే తెలుసు. అన్నదమ్ముల మధ్య ఏం జరుగుతోందో ఇట్టే గ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కోపం తట్టుకోలేక చిన్నోడు పూలకుండీ తన్నేసి వెళ్ళిపోతాడు.
నిజానికి ఇంట్లో అందరి గురించి ఇట్టే తెలుసుకునే మనిషి సీత. తన పాదం తాకిన భూమి కూడా కష్టపడ కూడదు అనుకుంటుంది. ఇంట్లో మామ్మ తో పూలు కోసేటప్పుడు మొక్కకి పూలు ఉండకూడదు అనుకుంటుంది. ఎందుకంటే “ఉండకూడదు అంటే ఉంటాయి” అనే ఫీలింగ్.
6.పెళ్ళి అయిపోయిన తరువాత ప్రకాష్ రాజ్ చిన్నోడిని పిలిచి అన్నదమ్ములు ఇద్దరినీ కలిసి మగ పెళ్ళి వారి ఆచారం ప్రకారం చిన్న తిరుపతి  వెళ్లి రమ్మంటాడు. అది కాస్తా చిన్నోడిని ఇరకాటం లో పెడుతుంది. “ నన్ను పెద్దోడికి చెప్పమంటావా?” అని ఆయన అడిగితే వాళ్ళిద్దరి మధ్య జరిగినది తండ్రికి తెలిస్తే బాగోదు అని “వద్దు” అని చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోతాడు. పెద్దోడిని ఎలాగోలా కన్విన్స్ చేద్దాం అని అతన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ అక్కడ పెద్దోడి మూడ్ బాగోలేకపోవడం, ఇతను వచ్చినా అతను రెసిప్రొకేట్ అవ్వకపోవడం చూసి చిన్నోడు వెళ్ళిపోతాడు. నిజానికి ఆ ఒక్క క్షణం లో ఏ ఒక్కరు సర్దుకుపోయినా సమస్య వుండకపోయేది.
7. మగ పెళ్ళి వారితో కలిసి చిన్న తిరుపతి వెళ్ళిన చిన్నోడికి ఒక వ్యక్తి ఎదురుపడి “పెళ్ళి మొత్తానికి మీ అన్నదమ్ములు ఇద్దరూ హైలెట్ అని, చెరోపక్క నిల్చొని పెళ్ళి చేసారని , అది వాళ్ళ తండ్రి నేర్పిన సంస్కారం .ఎప్పుడూ ఇలాగే రామలక్ష్మణులు లాగ వుండండి “ అని అంటాడు. మనం రోజూ చూసే వ్యక్తి, లేదా సంఘటన లో గొప్పదనం ఒక్కోసారి మనకి వేరే వాళ్ళు వచ్చి చెప్పేవరకు అర్ధంకాకపోవచ్చు. మనం చేసే తప్పు కూడా ఎవరో గుర్తు చేసేవరకు కూడా గుర్తు రాకపోవచ్చు.ఎన్నో ఈగోల అడ్డు గోడలు గీసుకోవడం వలన, కమ్యూనికేషన్ గ్యాప్ వలన వచ్చేది అది. అది అర్ధమైన చిన్నోడు , పెద్దోడికి కాల్ చేద్దాం అనుకుంటాడు. కానీ మళ్ళీ ఏదో ఇగో అడ్డొస్తుంది. ఈలోపు అతనినుంచే ఫోన్ వస్తుంది. కానీ ఎలా మొదలెట్టాలో పెద్దోడికి అర్ధం కాదు. చివరికి “ ఆరోజు పూల కుండీ ఎందుకు తన్నావురా “  అంటాడు. అది అతని ఎక్స్ ప్రెషన్. అది చిన్నోడికి అర్ధమై అతని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తాడు. ఒకరికి ఒకరు ఎదురవుతారు. మళ్ళీ కధ మొదటికే వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఈగోలు పోయాయి కానీ, మామూలు అవ్వడానికి టైం పడుతుంది అందుకే దగ్గరికి వచ్చిన చిన్నోడిని చూసి “ఏరా తిన్నావా?” అని అడుగుతాడు. అలా వాళ్ళిద్దరూ వారి ఈగోలని ఆ క్షణానికి కప్పి పుచ్చుకుంటారు. ఒక్క క్షణం ఆ రోజు గొడవ ఎందుకు జరిగిందో ఆలోచిస్తే సరిపోయేది. కానీ ఆలోచించరు . అదే డ్రామా లో వున్న గొప్పదనం. సన్నివేశాలు నిశితంగా పరిశీలిస్తే గాని ఈ లేయర్స్ దొరకవు.
8. ఈసారి హైదరాబాద్ లో ఎవరో జాబ్ ఇస్తానంటే చిన్నోడితో కలిసి వెళ్ళిన పెద్దోడు తన కోపంతో ఈ అవకాశం కూడా కోల్పోతాడు. అయితే ఈలోగా సమంతా చిన్నోడిని లంచ్ కి పిలిచి ఇంట్లో అందరికీ పరిచయం చేసి వాళ్ళ మధ్య వున్న విషయం అందరికీ చెప్పాలనుకుంటుంది. అక్కడికి వచ్చిన చిన్నోడిని రావు రమేష్ అవమానం చెయ్యబోతాడు. దానికి అతను సమాధానం కూడా చెబుతాడు. “ మీ పెద్దోడిని ఎవడికైనా చూపించండ్రా..ఆడు ఇలాగే గ్లాస్ నిండా నీళ్ళు ఇవ్వలేదని అన్నందుకు తెగ గొడవ చేసేసాడు” అంటాడు. అప్పుడు మొదటిసారి చిన్నోడికి ఆ రోజు జరిగిన విషయం అర్ధమవుతుంది. అతనికి వార్నింగ్ ఇచ్చి అక్కడనుంచి లేచోచ్చెస్తాడు. తన ప్లాన్ అంతా పాడైనందుకు చిన్నోడి వెనకాల పరిగెడుతూ వచ్చేసి ఏదో మారాం చేస్తూ వుంటుంది సమంత . ఇలా ఇద్దరూ నడుస్తూ వుండగా పెద్దోడిని గుద్దేస్తారు. అక్కడే ఇంకోసారి అతని అనుమానం బలపడుతుంది. ముందు సన్నివేశంలోనే వాళ్ళిద్దరి మధ్యా ఏమి లేదు అంటాడు చిన్నోడు. ఇలా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయేసరికి ఏం చేయాలో అతనికి అర్ధం కాదు. అనుకున్నట్టుగానే పెద్దోడు అలిగి హైదరాబాద్ నుంచి చెప్పకుండా వెళ్ళిపోతాడు. చిన్నోడు కూడా ఈ విషయం లో చిరాకు పడతాడు.
9. ఇలా ఇద్దరి మధ్యా వున్న గ్యాప్ ఇంకా పెరిగిపోతుంది, ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలు.కానీ ఇద్దరికీ ఈగోలు, చెపితే ఎదుటివాడు ఏమనుకుంటాడో అన్న ఫీలింగ్ అడ్డోస్తాయి.
10. ఈలోగా సీత ని చూసుకోడానికి పెళ్ళి సంభందం వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎదురుగా సీత వున్నప్పుడే పెద్దోడు వస్తాడు. అతనికి అన్నీ పనులూ చేసి పెట్టేది సీతే. నిజానికి సీతకి కూడా ఆ సంభందం ఇష్టం వుండదు. అందుకే అతను వచ్చే సమయానికి “ పిలవకూడదు ..పిలవకూడదు” అనుకుంటుంది. అతను పిలవాలి, తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి సంభందం క్యాన్సిల్ అవ్వాలని ఆమె కోరిక. చివరికి “ ఏయ్” అని పెద్దోడు పిలుస్తాడు. ఆమె అక్కడినుంచి పారిపోతుంది. పెద్దోడిని కాదని ఈ సంభందం తెచ్చిన వాళ్లందరూ అవాక్కయ్యిపోతారు.
11. ఈలోగా ప్రకాష్ రాజ్ కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ లో చేరతాడు. అక్కడికి చిన్నోడు వచ్చినా , ఇంకా ఇద్దరూ ఎడమొహం , పెడమొహం గానే వుంటారు. ప్రకాష్ రాజ్ డిశ్చార్జ్ అయ్యాక జయసుధ అతనితో అంటుంది ..” పెద్దోడికి మీరు ఒకసారి చెప్పి చూడండి “ అని. “ చిన్నోడికి చెప్పావా” అని అడుగుతాడు. “ చిన్నోడి గురించి అయితే పెద్దోడికి చెప్పమంటారు, పెద్దోడి సమస్య చిన్నోడికి చెప్పమంటారు..ఏంటండి” అని అడుగుతుంది. “ వాళ్ళిద్దరూ చూసుకుంటారు లే” అంటాడు.అంత నమ్మకం అతనికి.
12. చివరికి సీత కోరిక మీద భద్రాచలం వెళ్తారు. అక్కడకి రావు రమేష్ ఫ్యామిలీ కూడా వస్తుంది. వీళ్ళని చూసి ఇంకా పంతంతోనే వుంటాడు ఈయన. కానీ ప్రకాష్ రాజ్ కి రాముల వారి పల్లకీ మోసే అవకాశం అతని మంచితనం వలన వస్తుంది.డబ్బుతో వచ్చే గొప్పతనం కాదది. అది చూసి రావు రమేష్ సిగ్గు పడతాడు. సరిగ్గా అదే సమయం లో అక్కడ మంటలు చెలరేగుతాయి. పెద్దోడు చిన్నోడు దైర్య సాహసాలు ప్రదర్శించి అందరినీ రక్షిస్తారు. అందరూ వీళ్ళని మెచ్చుకుంటారు. ఇది చూసి తన లెగసీ ని కాపాడుతున్న కొడుకులిద్దరినీ కూర్చోపెట్టి “ సమాజానికి ఇంతకంటే ఏం ఇవ్వగలంరా...మంచి కుటుంబం తప్ప.  మీరు ఇద్దరూ ఈ జన్మకే అన్నదమ్ములు, తరవాత ఎవరికి ఎవరో” అని అతని జీవితపు ఫిలాసఫీ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ క్షణంలో ఇద్దరిలో వున్న అడ్డుగోడలు తొలగిపోయి కలుస్తారు. మనసులలో గూడు కట్టుకున్నవన్నీ కడిగేసుకుంటారు. వాళ్ళ జీవితపు విధానం మార్చుకోవాలనుకుంటారు.
ఇదంతా మళ్ళీ సీత దూరం నుంచి చూసి “నాకు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసు “ అంటూ ఏడుస్తుంది.
చివర్లో సీతకి పెద్దోడికి పెళ్ళి అవ్వడంతో కధ సుఖాంతం అవుతుంది.
నిజానికి ఇది అన్న మాట జవదాటని రామలక్ష్మణుల కధ కాదు.
ఆస్తి కోసం కొట్టుకు చచ్చే బారతం లోని పాత్రల్లా వుండే కధ కాదు...ఇద్దరు హీరోల కధ కూడా కాదు.
మనకి నిజ జీవితంలో ఎదురుపడే సాధారణమైన ఇద్దరు అన్నదమ్ములు, తండ్రి మంచితనం తాలుకా లెగసీ నిలబెట్టడానికి వాళ్ళ మధ్య నున్న ఇగోల అడ్డుగోడలు ఎలా పగలుగొట్టారు అని చూపించే కధ. అలా కధ పైపైన చెబుతూ లోపల ఇంకొ లేయర్ గురించి చెబుతాడు దర్శకుడు.నిశితంగా చూస్తే తప్ప సీన్ లో గొప్పతనం , ఇంకొ లేయర్ మనకి అర్ధం కావు. అలాగే సంభాషణలు కూడా సందర్భోచితంగా, పాత్ర తాలుకా మనస్తత్వం లోంచి వస్తాయి.

రెండోసారి చూస్తే నాకు అర్ధమైనది ఇది. మూడోసారి చూస్తే ఇంకెలా అర్ధమవుతుందో చూడాలి.

Sunday, August 11, 2013

Chennai Express review


After series of flops sharukh khan tied up with rohit shetty who gave blockbuster comedy 
entertainers to many heroes.
That movie is "chennai express". Deepika padukone is the co star to sharukh and 
they wanted to bring back the "Om shanthi Om" magic again.

Story: Rahul (Sharukh) is a person who does not have any sentiments in his life and when
 his grandfather dies, despite the sarrow he is planning to go Goa. Much to his surprise, his
grand mother forces him to Pour his grandfather's ashes in Rameswaram . Then he starts to rameswaram in chennai express.

To escape that tour, he explains his problem to his friends and asks them to wait at next 
station where he gets down and meet them and continue their plan to go goa as usual.

But when he forgets his grand father ashes in Chennai express, he goes back to train compartment where he meets Meenamma(deepika)  in DDLJ style .Meenamma is a daughter of a Don(periya thala) in tamilnadu. periya thala forces meenamma to get married to thangabali, a local goonda, inorder to increase his power in that area.

Due to some unexpected events, rahul goes to meenamma's house and trying to escape from there. and meenamma helps him to escape from there.Meanwhile meenamma loves rahul.

Will they be successful after all their trails,? will rahul realize meannamma's love towards him , will form the rest of the story.

Analysis: After a long time sharukh khan has shown his mettle and makes you laugh with his comedy timing and acting power.He reminds us the earlier days of sharukh.

Deepika is hot in traditional wear. Her hindi accent with tamil slang is funny. She is the show stealer. Sathya raj as a father to deepika has done a good job.

Remaining artists does not have much scope.

Rohit shetty who has weaved  very good entertainers in the past, has not able to generate much comedy as expected. Normally his movies have confusion comedy, but that is missing in this movie.

Story wise it is like " A person who doesnot respect any sentiments of others realizes his mistakes when a girl enters his life and teaches him what is love".

more or less it is a road journey movie where hero and heroine gets closer to each other after a series of events.

So major scope is for heroine and many ways hero is passive. But his antics to escape from the place forms a good entertainer though.

Screenplay wise, first half is good to set up the tempo to the story , but it lacks pace in the second half.Many scenes in the first half reminds us few south films like "Okkadu", "Bavagaru baagunnara" and "Muthu".

Dailogues are funny enough .

Chemistry between sharukh and deepika is good in the second half.

Direction by Rohit is good and production values are very good. Editing is very nice. Music is also very good.

Last but not least, Lungi dance which comes in the rolling titles is a tribute to Rajnikanth .

With the stardom value and decent entertainment, it may join 100 crores club easily. But it may not satisfy you much.Strictly for sharukh fans.

Bottom line: Time pass treat with some decent entertainment.

Tuesday, August 6, 2013

O thought where do you go


Hi all,

       The below poem written by one of my colleagues, Poornima. She is a good poet.

       I never knew her talent till i read this poem....Can't stop myself sharing this with you all. 

        Please read the below and let her know your comments.



" O thought where do you go
Seemingly light, languid and slow

Slowly you wander from thing to fellow
and cease from being mellow
You start with being a soft pillow
And end up as a spirit-gallow

I try to control you, but in vain
You take me to wander causing pain
I tell you strongly "Not again"
But at the end of the struggle, only you reign.


O thought where do you go
Seemingly light, languid and slow

I submit to you and fall in your deep well
Think deeply and feel "this is hell"
So many people, and so little care
Nobody has even a thought spare.

You take me around from people to thing
And make me forget a song to sing
Slowly I make a list of what is lost
Forgetting all the times that I enjoyed the most

 

O thought where do you go
Seemingly light, languid and slow

You sit on every name place and thing, like a fly
Silent, gradual restless and so sly
And then you rest on an old shopwoman I know, poor and frailing
Nevertheless always busy in her work, toothless but smiling

Struggling hard to make ends meet, but giving
A beggar here, a traveler there, bread or a thing
Bringing a smile on a hot day, with her heartfelt remarks
A place in every heart she marks


O thought where do you go
Seemingly light, languid and slow

With a prayer in her heart and peace in her smiles
She eases every person coming from the miles
Suffer from poverty she may 
But the traveler will thank god for meeting her today.

This subject of yours makes me think
what is causing me to lose  my mind, sigh and sink
Am I any less blessed than the old lady
Isn't my life more greener and more shady

O thought where do you go
Seemingly light, languid and slow

It may be an old lady I may hold in admiration
But people like these who are our inspiration
Make life worth living
And teach us that life is giving

So, thought! hover around these idols of humanity
Who save us from our insanity
Thinking of whom our minds rest in peace
Who come in a material desert as a cool breeze.
 
O thought where do you go
Seemingly light, languid and slow "

Sunday, August 4, 2013

Tribute to a friend

hi,

   Its a great boon to have a best friend with out any hypocrisy in anyone's life. 

    I too feel proud that i have friends like that.

   This article is dedicated to my best friends. 



"ఫ్రెండ్ అంటే....!
సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకోడానికి, ఒక చిన్న ఎస్.ఎమ్.ఎస్ పంపించి విష్ చెయ్యడానికి వాడేమీ జ్ఞాపకం కాదు....జీవితంలో ఒక చిన్న మజిలీ కాదు...ఒక మలుపూ కాదు...
సాదాసీదాగా జీవితంలోకి వచ్చి, పలక పుల్ల  ముక్క ఇచ్చో, చిన్న చాక్లెట్ ఇచ్చో మనకి దగ్గరయ్యి, మనకి వాడు తప్ప ఇంకెవడూ లేడు అనేట్లు చేసి, మాములుగా తిరుగుతూ స్నేహం చేస్తాడు. ఎదురింట్లోనో, పక్క వీధి లోనో వుంటూ ఆడుకోడానికి రమ్మంటాడు..
ఏదో ఒకరోజు నోట్సు ఇవ్వలేదనో, పిలవకుండా స్కూల్ కి వెళ్లిపోయాడనో అలిగి మాట్లాడం మానేసి, పార్టీ మర్చి వేరే స్నేహితులతో తిరుగుతూ మనల్ని దూరం చేసేసి, నిరంతరం తిట్టుకునేట్టు చేస్తాడు.
వాడి ఊహ, పేరు కూడా చేదుగా వుంటుంది అప్పుడు. వాడు ఎదురుపడితే కొడదాం అనిపిస్తుంది.కొన్నాళ్ళకి దూరం అవుతాడు, మళ్ళీ ఎక్కడో ఎదురవుతాడు...చూస్తే నవ్వుతాడు...”ఏరా ఎలా వున్నావ్” అంటూ పలకరిస్తాడు.
అలిగి మాట్టాడ్డం మానేసిన వాడు , ఈరోజు ఎంతో ఎత్తుకి ఎదిగినట్టు అనిపిస్తుంది. వాడిలో మెచ్యూరిటీ తెలుస్తుంది.మరి నేను ఎందుకు ఇలా అని అలోచించి వాడి స్నేహం మత్తులో పడతాం...
ఇక అప్పటినుంచి ఆ రోజులు రోజులు కావు....ఇంట్లో ఎవరూ గుర్తుండరు...వీడి స్నేహం తప్ప...!
చివరికి ఇంట్లో వాళ్లకి కూడా వీడంటే కోపం వస్తుంది...తరువాత తరువాత వీడు తప్ప ఇంకెవడూ ఫ్రెండ్ లేడని వాళ్లకి అర్ధం అవుతుంది...
ఆటలు, పాటలు, సినిమాలు, షికార్లు, అన్నీ వాడితోనే....
మంచి అలవాట్లూ నేర్పిస్తాడు....చెడు అలవాట్లూ పరిచయం చేస్తాడు..
ఇంటికి దూరంగా వుంటూ కాలేజి లో చదువుకునేటప్పుడు....వాడే గురువు, వాడే తల్లి, వాడే తండ్రి, వాడే అన్న , వాడే  తమ్ముడు...
రక్త సంభందం లేదు కానీ....రక్త సంభందం కంటే ఎక్కువ.....!
వాడితో షేర్ చేసుకోని విషయం వుండదు....మాట్లాడని మేటర్ వుండదు. దూరంగా వుంటే వాడి ఉత్తరం కోసం ఎదురుచూసేలా చేస్తాడు...దగ్గరగా వుంటే మనల్ని మర్చిపోయేలా చేస్తాడు.
వాడు ఏడిచి...మనల్ని ఏడిపిస్తాడు...మనం ఏడిచినప్పుడు మనల్ని నవ్విస్తాడు.
వాడు గెలిచినప్పుడు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. మన మీదే గెలిచినప్పుడు ఈర్ష్యగా అనిపిస్తుంది.
మళ్ళీ అంతా మామూలే...!
చిన్నప్పుడు స్కూల్లో ఎదురవుతాడో, కాలేజి లో ఎదురవుతాడో, ఆఫీస్ లో ఎదురవుతాడో తెలీదు గానీ, వాడి రాక మనల్నే కొత్తగా పరిచయం చేస్తుంది...ఏవో కొత్తగా నేర్పిస్తుంది....
అన్నీ పంచుకున్నాక...ఇక ఏమి మిగలదు.
అన్నీ తెలుసుకున్నాక ...తెలుసుకోడానికి ఏమీ వుండదు....కానీ మళ్ళీ కొత్తగా కనిపిస్తాడు.
జీవితం పరుగుల పందెం లో పడిపోయినా , ఎక్కడెక్కడో ఉద్యోగాల రీత్యా విడిపోయినా  “ ఏరా ...ఎలా వున్నావ్..?” అన్న ఒక్క పలకరింపు చాలు.... ”అంతా నార్మల్ ఏనా..” అన్న ఒక్క కుశల ప్రశ్న చాలు...
వాడితో రోజూ మాట్లాడక్కర లేదు...రోజూ ఆలోచించక్కర లేదు...
మాట్లాడకపోతే వదిలేస్తాడు అన్న ఇన్సెక్యూరిటీ లేదు...
పలకరించకపోతే ఫీల్ అవుతాడు అన్న భయం లేదు...
నా ఫంక్షన్ కి వాడు రాకపోతే వెలితి వుంటుంది...కాని వాడు ఎందుకు రాలేదు అన్న ప్రశ్న వుండదు.
ఈసారి నా వంతు అనే ఈగో వుండదు...రాలేకపోతున్నందుకు ఎంత మధనపడతాడో అనే ఆలోచన వుంటుంది.
ఈగోలని దాటి, హిపోక్రసీ ని దాటి వుంటుంది వాడి స్నేహం....
వాడొక నీడ...మనతోనే వుంటాడు..
జీవితపు చరమాంకపు దశలో వాడు నాకొక ఆసరా...ఒక ఆట విడుపు....ఒక సాయకాలం “ ఆరోజుల్లో” అని తలుచుకునే మంచి జ్ఞాపకం, జీవితంలో నేను చేసుకున్న మంచి అలవాటు....నీడలా నన్ను అంటిపెట్టుకున్న నా నేస్తం, నేను కోరుకోకుండా నాకు ఎదురైన ఒక వరం.
“ దోస్త్ మేరా దోస్త్” అనుకుంటూ ఇన్నాళ్ళు తిరగకపోయినా, నా భావితరాలకు గర్వంగా పరిచయం చేసుకోగలిగే చక్కని అవకాశం, స్నేహానికి నాకున్న అర్హత....!
వాడి గురించి చెప్పడానికి ఈ ఒక్క ఆర్టికల్ చాలదు....వాడిని గుర్తు చేసుకోడానికి ఈ ఒక్క రోజే అవసరం లేదు.
ఎందుకంటే ..వాడు జీవితంలో ఒక మజిలీ కాదు....ఒక మలుపూ కాదు.
ఇలాంటి స్నేహితులను కలిగి వున్న అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు."
Note:
(నాకు జీవితంలో స్నేహానికి చిరునామాగా అనిపించే బాపు-రమణ లను చూస్తే గౌరకపూర్వకమైన ఈర్ష్య...అందుకే ఈ ఆర్టికల్)

  

Aavedhana

Hi all,


          One of my colleagues, karthik nagalingam has written a poem. he is a social worker and an enthusiast in politics as well. He is supporting "Surajyam movement" led by FDI and loksatta.


          I am posting that poem written by him for all of you..please let me know your comments.



"ఆవేదన ....ఆవేదన...ఆవేదన....ఆవేదన...!
నిత్య జన జీవన స్రవంతి లో నా జీవితమ్ ఒక ఆవేదన...!
ఈ నా జీవన సమరం లో ఎవరు మన, ఎవరు పర అని తెలుసుకోలేకపోతున్నాననే ఆవేదన...!
ఈ అవసరాల బంధుత్వాలు, ఈ అవకాశాల బాంధవ్యాలు నా జీవనాన్ని భారంగా చేస్తున్నాయనే ఆవేదన...!

అధర్మమే ధర్మమైన ఈరోజుల్లో ధర్మమే పరమావధిగా ఎంచుకున్న నన్ను వ్యవస్థ పిచ్చివాడిలా చూస్తోందే అనే ఆవేదన...!
సాటి మనిషితో స్నేహం తన అవసరాలు తీర్చుకోడానికిగా అయిపోయింది.
నేను వీడితో స్నేహం చేస్తే నాకేంటి లాభం అని ఆలోచిస్తోందే ఈ వ్యవస్థ అనే ఆవేదన...
ఈ జీవన సమరంలో నా గమ్యం నా కుటుంబాన్ని, ఈ కరడుగట్టిన వ్యవస్థ నుండి కాపాడుటయే అయ్యిందని ఆవేదన.
మానవ జీవిత లక్ష్యం శాంతి, ఆనందం, తృప్తి అనే మూడు అనుభూతులతో నిండి వుండాలే గానీ
ఆవేశం, ఆక్రోశం, క్రోధం, స్వార్ధంతో నిండుకున్నదని ఆవేదన.
రాను రాను ఈ వ్యవస్థ దిగజారుడుతనం చూస్తే ఆవేదన
ఈ కలియుగ ప్రధమ పాదం లోనే ఇన్ని అవాంతరాలు, అవాంచనీయ సంఘటనలు నేను ఊహించలేకున్నా....
ఈ వ్యవస్థ రాబోవు రోజుల్లో ఇంకెంత దిగజారుతుందోనన్న ఆవేదన...
ప్రతి మనిషి దైవంగా పరిణామం చెందితేగానీ ఈ వ్యవస్థ బాగుపడదే..!
ఈ వ్యవస్థ లో వున్న అజ్ఞానం వల్ల దైవం అంటే కేవలం కోరికలు తీర్చేవాడిగానే అనుకుంటోంది.
ఆ దైవం యొక్క నిజతత్వం తెలుసుకోలేక పోతోందనే ఆవేదన.
ఆవేదన..ఆవేదన...ఆవేదన..ఆవేదన....! 

Thursday, August 1, 2013

Gaju kallu


Hi all,

         As i mentioned in my previous posts, this is my first story which got published in Koumudi magazine in July,2010 .

        When this story got published, i was on an assignment in UK and after seeing this story in the magazine, i was on cloud nine.!!!!

       Since it was my first published story, i was so happy...it took nearly 8 years for me to get this done.

      After so many unpublished stories and debacles, i got a break through.


However, there is a small inspiration and a story behind this which i wanted to share with  you all.

One day, i was on my way back to chennai from vishakapatnam by howrah express, i came across this incident.

In railway station, my close friend nagesh and his wife gave me some eatables forcefully even though i was rejecting as i was already having a food parcel which my mother packed for me.

   if i could have stopped them from giving that parcel, My story wouldn't have come out...

    i dont want to describe it more, just go through the link and enjoy it yourself...and do let me know your comments ...!

  http://koumudi.net/Monthly/2010/july/july_2010_kadhakoumudi_3.pdf