Sunday, August 4, 2013

Aavedhana

Hi all,


          One of my colleagues, karthik nagalingam has written a poem. he is a social worker and an enthusiast in politics as well. He is supporting "Surajyam movement" led by FDI and loksatta.


          I am posting that poem written by him for all of you..please let me know your comments.



"ఆవేదన ....ఆవేదన...ఆవేదన....ఆవేదన...!
నిత్య జన జీవన స్రవంతి లో నా జీవితమ్ ఒక ఆవేదన...!
ఈ నా జీవన సమరం లో ఎవరు మన, ఎవరు పర అని తెలుసుకోలేకపోతున్నాననే ఆవేదన...!
ఈ అవసరాల బంధుత్వాలు, ఈ అవకాశాల బాంధవ్యాలు నా జీవనాన్ని భారంగా చేస్తున్నాయనే ఆవేదన...!

అధర్మమే ధర్మమైన ఈరోజుల్లో ధర్మమే పరమావధిగా ఎంచుకున్న నన్ను వ్యవస్థ పిచ్చివాడిలా చూస్తోందే అనే ఆవేదన...!
సాటి మనిషితో స్నేహం తన అవసరాలు తీర్చుకోడానికిగా అయిపోయింది.
నేను వీడితో స్నేహం చేస్తే నాకేంటి లాభం అని ఆలోచిస్తోందే ఈ వ్యవస్థ అనే ఆవేదన...
ఈ జీవన సమరంలో నా గమ్యం నా కుటుంబాన్ని, ఈ కరడుగట్టిన వ్యవస్థ నుండి కాపాడుటయే అయ్యిందని ఆవేదన.
మానవ జీవిత లక్ష్యం శాంతి, ఆనందం, తృప్తి అనే మూడు అనుభూతులతో నిండి వుండాలే గానీ
ఆవేశం, ఆక్రోశం, క్రోధం, స్వార్ధంతో నిండుకున్నదని ఆవేదన.
రాను రాను ఈ వ్యవస్థ దిగజారుడుతనం చూస్తే ఆవేదన
ఈ కలియుగ ప్రధమ పాదం లోనే ఇన్ని అవాంతరాలు, అవాంచనీయ సంఘటనలు నేను ఊహించలేకున్నా....
ఈ వ్యవస్థ రాబోవు రోజుల్లో ఇంకెంత దిగజారుతుందోనన్న ఆవేదన...
ప్రతి మనిషి దైవంగా పరిణామం చెందితేగానీ ఈ వ్యవస్థ బాగుపడదే..!
ఈ వ్యవస్థ లో వున్న అజ్ఞానం వల్ల దైవం అంటే కేవలం కోరికలు తీర్చేవాడిగానే అనుకుంటోంది.
ఆ దైవం యొక్క నిజతత్వం తెలుసుకోలేక పోతోందనే ఆవేదన.
ఆవేదన..ఆవేదన...ఆవేదన..ఆవేదన....! 

No comments:

Post a Comment