hi,
Its a great boon to have a best friend with out any hypocrisy in anyone's life.
I too feel proud that i have friends like that.
This article is dedicated to my best friends.
"ఫ్రెండ్ అంటే....!
సంవత్సరానికి ఒకసారి గుర్తు
చేసుకోడానికి, ఒక చిన్న ఎస్.ఎమ్.ఎస్ పంపించి విష్ చెయ్యడానికి వాడేమీ జ్ఞాపకం
కాదు....జీవితంలో ఒక చిన్న మజిలీ కాదు...ఒక మలుపూ కాదు...
సాదాసీదాగా జీవితంలోకి
వచ్చి, పలక పుల్ల ముక్క ఇచ్చో, చిన్న చాక్లెట్ ఇచ్చో మనకి దగ్గరయ్యి, మనకి వాడు తప్ప
ఇంకెవడూ లేడు అనేట్లు చేసి, మాములుగా తిరుగుతూ స్నేహం చేస్తాడు. ఎదురింట్లోనో,
పక్క వీధి లోనో వుంటూ ఆడుకోడానికి రమ్మంటాడు..
ఏదో ఒకరోజు నోట్సు
ఇవ్వలేదనో, పిలవకుండా స్కూల్ కి వెళ్లిపోయాడనో అలిగి మాట్లాడం మానేసి, పార్టీ
మర్చి వేరే స్నేహితులతో తిరుగుతూ మనల్ని దూరం చేసేసి, నిరంతరం తిట్టుకునేట్టు
చేస్తాడు.
వాడి ఊహ, పేరు కూడా చేదుగా
వుంటుంది అప్పుడు. వాడు ఎదురుపడితే కొడదాం అనిపిస్తుంది.కొన్నాళ్ళకి దూరం అవుతాడు,
మళ్ళీ ఎక్కడో ఎదురవుతాడు...చూస్తే నవ్వుతాడు...”ఏరా ఎలా వున్నావ్” అంటూ
పలకరిస్తాడు.
అలిగి మాట్టాడ్డం మానేసిన
వాడు , ఈరోజు ఎంతో ఎత్తుకి ఎదిగినట్టు అనిపిస్తుంది. వాడిలో మెచ్యూరిటీ
తెలుస్తుంది.మరి నేను ఎందుకు ఇలా అని అలోచించి వాడి స్నేహం మత్తులో పడతాం...
ఇక అప్పటినుంచి ఆ రోజులు
రోజులు కావు....ఇంట్లో ఎవరూ గుర్తుండరు...వీడి స్నేహం తప్ప...!
చివరికి ఇంట్లో వాళ్లకి
కూడా వీడంటే కోపం వస్తుంది...తరువాత తరువాత వీడు తప్ప ఇంకెవడూ ఫ్రెండ్ లేడని
వాళ్లకి అర్ధం అవుతుంది...
ఆటలు, పాటలు, సినిమాలు,
షికార్లు, అన్నీ వాడితోనే....
మంచి అలవాట్లూ
నేర్పిస్తాడు....చెడు అలవాట్లూ పరిచయం చేస్తాడు..
ఇంటికి దూరంగా వుంటూ కాలేజి
లో చదువుకునేటప్పుడు....వాడే గురువు, వాడే తల్లి, వాడే తండ్రి, వాడే అన్న , వాడే తమ్ముడు...
రక్త సంభందం లేదు
కానీ....రక్త సంభందం కంటే ఎక్కువ.....!
వాడితో షేర్ చేసుకోని విషయం
వుండదు....మాట్లాడని మేటర్ వుండదు. దూరంగా వుంటే వాడి ఉత్తరం కోసం ఎదురుచూసేలా
చేస్తాడు...దగ్గరగా వుంటే మనల్ని మర్చిపోయేలా చేస్తాడు.
వాడు ఏడిచి...మనల్ని
ఏడిపిస్తాడు...మనం ఏడిచినప్పుడు మనల్ని నవ్విస్తాడు.
వాడు గెలిచినప్పుడు ఎంతో
గర్వంగా అనిపిస్తుంది. మన మీదే గెలిచినప్పుడు ఈర్ష్యగా అనిపిస్తుంది.
మళ్ళీ అంతా మామూలే...!
చిన్నప్పుడు స్కూల్లో
ఎదురవుతాడో, కాలేజి లో ఎదురవుతాడో, ఆఫీస్ లో ఎదురవుతాడో తెలీదు గానీ, వాడి రాక
మనల్నే కొత్తగా పరిచయం చేస్తుంది...ఏవో కొత్తగా నేర్పిస్తుంది....
అన్నీ పంచుకున్నాక...ఇక ఏమి
మిగలదు.
అన్నీ తెలుసుకున్నాక
...తెలుసుకోడానికి ఏమీ వుండదు....కానీ మళ్ళీ కొత్తగా కనిపిస్తాడు.
జీవితం పరుగుల పందెం లో
పడిపోయినా , ఎక్కడెక్కడో ఉద్యోగాల రీత్యా విడిపోయినా “ ఏరా ...ఎలా వున్నావ్..?” అన్న ఒక్క పలకరింపు
చాలు.... ”అంతా నార్మల్ ఏనా..” అన్న ఒక్క కుశల ప్రశ్న చాలు...
వాడితో రోజూ మాట్లాడక్కర
లేదు...రోజూ ఆలోచించక్కర లేదు...
మాట్లాడకపోతే వదిలేస్తాడు
అన్న ఇన్సెక్యూరిటీ లేదు...
పలకరించకపోతే ఫీల్ అవుతాడు
అన్న భయం లేదు...
నా ఫంక్షన్ కి వాడు రాకపోతే
వెలితి వుంటుంది...కాని వాడు ఎందుకు రాలేదు అన్న ప్రశ్న వుండదు.
ఈసారి నా వంతు అనే ఈగో వుండదు...రాలేకపోతున్నందుకు
ఎంత మధనపడతాడో అనే ఆలోచన వుంటుంది.
ఈగోలని దాటి, హిపోక్రసీ ని
దాటి వుంటుంది వాడి స్నేహం....
వాడొక నీడ...మనతోనే
వుంటాడు..
జీవితపు చరమాంకపు దశలో వాడు
నాకొక ఆసరా...ఒక ఆట విడుపు....ఒక సాయకాలం “ ఆరోజుల్లో” అని తలుచుకునే మంచి
జ్ఞాపకం, జీవితంలో నేను చేసుకున్న మంచి అలవాటు....నీడలా నన్ను అంటిపెట్టుకున్న నా
నేస్తం, నేను కోరుకోకుండా నాకు ఎదురైన ఒక వరం.
“ దోస్త్ మేరా దోస్త్”
అనుకుంటూ ఇన్నాళ్ళు తిరగకపోయినా, నా భావితరాలకు గర్వంగా పరిచయం చేసుకోగలిగే చక్కని
అవకాశం, స్నేహానికి నాకున్న అర్హత....!
వాడి గురించి చెప్పడానికి ఈ
ఒక్క ఆర్టికల్ చాలదు....వాడిని గుర్తు చేసుకోడానికి ఈ ఒక్క రోజే అవసరం లేదు.
ఎందుకంటే ..వాడు జీవితంలో
ఒక మజిలీ కాదు....ఒక మలుపూ కాదు.
ఇలాంటి స్నేహితులను కలిగి
వున్న అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు."
Note:
(నాకు జీవితంలో స్నేహానికి
చిరునామాగా అనిపించే బాపు-రమణ లను చూస్తే గౌరకపూర్వకమైన ఈర్ష్య...అందుకే ఈ
ఆర్టికల్)
chala bagundhi Sekhar garu.. :-)
ReplyDeleteAparna AV
thanks madam
ReplyDelete