Hi all,
Few stories will haunt you even after reading it. I read such story recently which i wanted to share with u all.
this story is named as"Kaasi ki vellina kadha " Which was written by JSV prasad. and it is published in Swathi magazine last week.
Initially i did not like the narration of the story as i felt it may be like regular saga of an old couple, But at the end of the story, he captured the sense of humanity and compassion.
i will tell you the story in a brief now. I cant write in such a way he wrote it, but its gist of it.
Few stories will haunt you even after reading it. I read such story recently which i wanted to share with u all.
this story is named as"Kaasi ki vellina kadha " Which was written by JSV prasad. and it is published in Swathi magazine last week.
Initially i did not like the narration of the story as i felt it may be like regular saga of an old couple, But at the end of the story, he captured the sense of humanity and compassion.
i will tell you the story in a brief now. I cant write in such a way he wrote it, but its gist of it.
ఒక వూర్లో ఒక వృద్ధ జంట
వుంటారు. అందులో ఆ ముసలాయనకి ఎప్పుడూ దగ్గు వస్తూ వుంటుంది. అది చూసిన వాళ్ళావిడ “
అబ్బాయికి చెప్పి ఏదైనా మంచి హాస్పిటల్ కి తీసుకెళ్ళమని చెబుతాను..” అంటుంది.
దానికి ఆయన “వాడిని ఎందుకు
ఇబ్బంది పెట్టడం ...ఏదో చిన్న సిరప్ తాగితే పోతుంది “ అంటాడు.
మొత్తం ఆస్తి అంతా కొడుకు
పేరన రాసేయ్యడం వలన కొడుకు వీళ్ళని సరిగ్గా పట్టించుకోడు. కొడుకు పేరు శ్రవణ్. పైగా
పెన్షన్ వచ్చే టైం కి కోడలు, మనవలని అందరినీ తాత,మామ్మ దగ్గరికి పంపేస్తుంది.
వాళ్లకి చాక్లెట్లు,ఐస్ క్రీం లు కొని ఇచ్చి వీళ్ళ డబ్బులు ఖర్చు చేసుకుంటూ
వుంటారు. అది వీళ్ళ పరిస్థితి.
ఇక ఎంతో కాలం బతకం అని
తెలిసిన ఈ ముసలాయనకి ఒక ఆఖరి కోరిక వుంటుంది . అది కాశీకి వెళ్లడం. కొడుకుని
ఎన్నిసార్లు అడిగినా డబ్బు ఖర్చు అని చెప్పి తీసుకెళ్లడం మానేస్తాడు. చివరికి
ఒకరోజు అప్పులవాడు శ్రవణ్ ఆఫీస్ దగ్గరికి వచ్చేటప్పటికి ,వాడినుంచి ఎలా
తప్పించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న ఇతనిని చూసి ఒక తలకుమాసిన స్నేహితుడు ఒక
సలహా ఇస్తాడు.
ఇప్పుడు ఇతని తల్లి ,తండ్రి
వుంటున్న ఇతని ఇల్లు రెండు లక్షలు చేస్తుంది. అందులో కొంత అప్పు తీర్చి, వీళ్ళని ఎక్కడైనా అనాధ ఆశ్రమంలో వదిలేస్తే, లక్ష
రూపాయలు మిగులుతుందని సలహా ఒకటి పారేస్తాడు. సరిగ్గా అది విని ఐడియా వచ్చి శ్రవణ్,
ఇంటికొచ్చి అమ్మా నాన్నలని కాశీకి తీసుకెళ్తానని చెప్పి ,భార్య కి చెప్పి కాశీ
బయలు దేరతాడు.
తమ జీవితంలో వున్న ఏకైక
కోరిక తనయుడు తీరుస్తున్నందుకు ఆ వృద్ద జంట లోలోపలే మురిసిపోతారు.
కాశీకి తీసుకెళ్ళిన శ్రవణ్,
వీళ్ళని అన్నీ ఘాట్ లకి తిప్పి, చివరికి ఒక ఘాట్ లో చెట్టు కింద కూర్చో బెట్టి, టిఫిన్స్
తీసుకొస్తానని, తండ్రి చేతిలో వున్న బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాడు. అందులో ఫోన్
నంబర్ల బుక్ కూడా వుంటుంది.
ఆ ఘాట్ దగ్గర ప్రశాంతం గా
కూర్చున్న జంట , అలాగే చాలాసేపు వుండిపోతారు. ఎంతసేపటికీ కొడుకు రాడు. ఎక్కడైనా
తప్పిపోయాడో, లేదా ఏదైనా ఇబ్బంది పడుతున్నాడో అని ఆలోచిస్తూ, తండ్రి ఫోన్ నంబర్ల
పుస్తకం గురించి చూస్తాడు. అది కూడా బ్యాగ్ లోనే వుండిపోయింది. ఏదో కొంత డబ్బు
మాత్రం మిగిలి వుంటుంది.
అంతమంది జనాల మధ్యలో కాశీలో
తల్లిని తండ్రిని వదిలేసి శ్రవణ్ ఇంటికొచ్చేస్తాడు. ఇంటికొచ్చాక జరిగింది భార్యతో
చెప్పి , వాళ్ళు ఎక్కడో తప్పిపోయారని నాటకం ఆడమంటాడు. జనాలందరి దృష్టిలో వీళ్ళ
అమ్మా,నాన్న కాశీలో తప్పిపోయారు. కొన్ని రోజుల తరవాత, వాళ్ళిద్దరూ అక్కడే
చనిపోయారని చెప్పి ఏడుస్తాడు. ఇది చుట్టుపక్కల వున్నవాళ్ళు కూడా నమ్మేస్తారు. అతను
అనుకున్నట్టుగానే ప్లాన్ నడిచింది.
సాధారణంగా కాశీలో ఎవరైనా
తమకి నచ్చినవి వదిలెయ్యాలి అంట, అలా ఈ శ్రవణ్ అమ్మా,నాన్నలని వదిలేశాడు. ఇది
జరిగిన కొద్దిరోజులకి తల్లికి,తండ్రికి పెద్ద కర్మ కూడా చేసేస్తాడు. చివరి
వయస్సులో తల్లితండ్రులకి సహాయంగా వుంటాడని ఇతనికి శ్రవణ్ అని వీళ్ళు పేరు
పెట్టుకున్నారు. ఆ శ్రవణ కుమారుడు గుడ్డి వాళ్లైన తల్లిని,తండ్రిని కావిడి లో
మోస్తే , ఈ శ్రవణ్ వీళ్ళని ఇలా అర్ధాంతరం గా వదిలేశాడు.
పెద్ద కర్మ అయిన
కొద్దిరోజులకి ఇతనికి ఒక ఉత్తరం వస్తుంది. అది ఎవరో తెలిసిన వాళ్ళు రాసినది కాదు.
అందులో ఇలా వుంటుంది. “ బాబు, కొద్దిరోజుల క్రితం కాశీలో ఒక ఘాట్ పక్కనే కూర్చుని
తమ బిడ్డకోసం ఎదురుచూస్తున్న ఒక ముసలి జంటని చూశాను. వాళ్ళెవరో చూసినట్టుందే , అని
వెళ్లి అడిగితే, మా వూరికి దగ్గర్లోనే వున్న ఒక ఊరినుంచి వచ్చారని తెలిసింది.
టిఫిన్స్ తెస్తానని వెళ్ళిన కొడుకు రాకుండా పోయేసరికి, అతని నంబర్ ఏదైనా
వుంటుందేమో అని చూస్తే, ఫోన్ బుక్ అతను తీసుకేల్లిపోయినట్టు తెలిసింది. అలాగె
ఎదురు చూసిన జంటకి కొంత సహాయం చేసి వచ్చేసాను. కొద్ది రోజులకి, ఆ ముసలావిడ కొడుకు
చేసిన మోసం భరించలేక గంగ నదీ ప్రవాహం లో పడి కొట్టుకుపోయింది. కానీ ఆ ముసలాయన
అలాగే వున్నాడు. చివరికి అతనిని ఆదరించి అక్కడి నుంచి వాళ్ళ ఊరికి తీసుకొచ్చాను.
వచ్చేటప్పటికి జరిగే తంతు చూసి అతనికి గుండె ఆగినంత పనయ్యింది. ఆరోజు అతని పెద్ద
కర్మ.
జుట్టు మాసిపోయి, బాగా వడిలిపోయిన
అతనిని, నన్ను ఎవరూ గుర్తు పట్ట లేదు. ఆ పంక్తి లో కూర్చుని అతను భోజనం చేస్తా
అన్నాడు. తన పిండాకూడు తనే , తినగలిగే
అవకాశం దొరికినందుకు ఎంతో సంతోషించాడు. చాలా రోజులయ్యిందేమో తిని, తృప్తిగా
తిన్నాడు. చివర్లో కొడుకుని ఆశీర్వదించి వచ్చి కాశీలో గుండె ఆగి చనిపోయాడు.
ఇంతకీ ఆ వచ్చిన వ్యక్తి నీ
తండ్రి. ఇదంతా నీకు చెప్పొద్దు అన్నాడు. కానీ, ఇలాంటి కొడుకు కధ పది మందికీ
తెలిస్తే మంచిది అని నేను నీకు చెబుతున్నా...ఇందులో పాత్రల పేర్లు మార్చి ఒక
వందమందికి ఈ కధ రాసి పంపించు. కనీసం అది చదివిన వాళ్ళైనా నీలాగా ఆలోచించకుండా
వుంటారు.” ...అదీ సారాంశం.
ఇది చదవి కొడుక్కి కళ్ళమ్మట
నీళ్ళు వస్తాయి. వెక్కి వెక్కి ఏడుస్తూ వుంటాడు.
పక్కనే ఇంట్లో ఒక పిల్లాడు
వేమన శతకం చదువుతూ వుంటాడు. “ తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు
గిట్ట నేమి, పుట్టలోని చెదలు పుట్టవా,గిట్టవా” అని వేమన పద్యం చదువుతాడు.
కధ చివరికి ఆ ఉత్తరం చదువుతున్నప్పుడు
నిజంగా మనకి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. రెండువారాల క్రితం స్వాతి సంచిక అందుబాటులో
వున్న వారు ఈ కధ తప్పక చదవండి. లేదా ఒక వారం లో నేను ఈ కధని స్కాన్ చేసి ఈ బ్లాగ్
లో మీ అందరికోసం ఇక్కడ వుంచుతాను..
అన్ని కధలు సాధారణంగా కంచి
కి వెళ్తాయి అంటారు, కానీ వీళ్ళ కధ మాత్రం కాశీకి వెళ్ళింది అంటాడు రచయిత.
ఇలాంటి కధ రాసిన రచయిత
జె.ఎస్.వి. ప్రసాద్ కు మాత్రం ప్రత్యేకంగా అభినందనలు తెలపాలి.
No comments:
Post a Comment